మండలంలోని పెద్దకల్వల క్రాసింగ్ వద్ద నిమ్మనపల్లి గ్రామస్తులు మంగళవారం మట్టి టిప్పర్లను అడ్డుకుని రాస్తారోకో చేశారు.

పెద్దపల్లి రూరల్, జూన్ 2 : మండలంలోని పెద్దకల్వల క్రాసింగ్ వద్ద నిమ్మనపల్లి గ్రామస్తులు మంగళవారం మట్టి టిప్పర్లను అడ్డుకుని రాస్తారోకో చేశారు. సర్పంచ్ వేల్పుల రమేశ్ ఆధ్వర్యంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు అక్కడే ఎండలోనే బైఠాయించారు. తలలకు రుమాళ్లు కట్టుకొని, మంచినీళ్లు తెచ్చుకొని మరీ ఆందోళన చేశారు.
