బీజూ జనతా దళ్ మాజీ రాజ్యసభ ఎంపీ దేబషిశ్ సమంతరే ఇవాళ బీజేపీలో చేరారు. సోమవారం ఆయన బీజేడీ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బీజేడీ నాయకత్వాన్ని విమర్శించారు. ప్రజల ప్రయోజనం కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

న్యూఢిల్లీ: బీజూ జనతా దళ్ మాజీ రాజ్యసభ ఎంపీ దేబషిశ్ సమంత ఇవాళ బీజేపీలో చేరారు. సోమవారం ఆయన బీజేడీ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బీజేడీ నాయకత్వాన్ని విమర్శించారు. ప్రజల ప్రయోజనం కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. చాలా కఠినమైన మార్పు అని, కానీ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. బీజేడీ పార్టీలో ఆయన చాన్నాళ్లూ అనేక హోదాల్లో పని చేశారు. బీజేడీని వీడిన మూడవ రాజ్యసభ ఎంపీగా దేబషిశ్ నిలిచారు
