ఇరాన్‌కు చెందిన శుద్దీకరించిన యురేనియం నిల్వలను సక్రమ పద్ధతిలో ధ్వంసం చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు

న్యూయార్క్: ఇరాన్ వద్ద శుద్దీకరించిన యురేనియం నిల్వలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ యురేనియంను సక్రమ పద్ధతిలో ధ్వంసం చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఆయన తన ట్రుత్ సోషల్ అకౌంట్లో ఈ విషయాన్ని తెలిపారు. శుద్దీకరించిన యురేనియం( న్యూక్లియర్ డస్ట్)ను అమెరికాకు తీసుకువచ్చి దాన్ని ధ్వంసం చేస్తామని లేదంటే ఇరాన్ సహకారంతో ఆ దేశంలో కానీ లేదా మరో ప్రదేశంలో ధ్వంసం చేయనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అటామిక్ ఎనర్జీ కమిషన్ లేదా ఆ స్థాయికి తగ్గ సంస్థ సాక్షిగా .. యురేనియం నిల్వలను నిర్వీర్యం చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు తెలిపారు.
