నవ భారత్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్, పాల్వంచ సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్య పాఠశాల విద్యార్థిని, విద్యార్థుల సౌకర్యార్థం డెస్క్ (బల్లలు) బెంచీలను డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ & జడ్పీ సీఈఓ, భద్రాద్రి కొత్తగూడెం బి.నాగలక్ష్మి చేతుల మీద మీదుగా..

పాల్వంచ, డిసెంబర్ 30 : నవ భారత్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్, పాల్వంచ సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్య పాఠశాల విద్యార్థిని, విద్యార్థుల సౌకర్యార్థం డెస్క్ (బల్లలు) బెంచీలను డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ & జడ్పీ సీఈఓ, భద్రాద్రి కొత్తగూడెం బి.నాగలక్ష్మి చేతుల మీద మీదుగా మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ ప్రభుత్య పాఠశాలలకు నవ భారత్ ఎనర్జీ అధించిన సహకారాల గురించి ప్రస్థావించారు. పలు ప్రభుత్వ పాఠశాలలకు సైన్స్ ప్రయోగ శాలలు, ప్రయోగ పరికరాలు అందించినట్లు తెలిపారు. అలాగే విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించాటానికి నైపుణ్యం గల ఉపాధ్యాయులను నియమించడం సంతోషదాయకం అన్నారు.
