నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీ సమీపంలోని పొలాల్లో మంగళవారం అరుదైన శ్వేతనాగు(తెల్లటి నాగుపాము) దర్శనమివ్వడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.

ఖానాపూర్, జూలై 7 : నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీ సమీపంలోని పొలాల్లో మంగళవారం అరుదైన శ్వేతనాగు(తెల్లటి నాగుపాము) దర్శనమివ్వడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. శ్రీరాంనగర్ కాలనీకి చెందిన ఆసూరి సంతోష్, రవిలు పొలాలను పరిశీలించి తిరిగి వస్తుండగా, రోడ్డుకు ఆనుకుని ఉన్న ఓ పొలంలో సుమారు ఆరు అడుగుల పొడవు ఉన్న తెల్లటి నాగుపాము కనిపించింది.
