ప్రతి నిత్యం నార్మూల్ డెయిరీకి పాలు పోసే రైతులకు గతంలో ప్రతి పదిహేను రోజులకోసారి బిల్లులను వారి బ్యాంకు ఖాతాల్లో వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాడి రైతుల దుస్థితి చెప్పనలవి కాకుం డా ఉంది.

జిల్లాలో పాల ఉత్పత్తి చేసే పాడి రైతుల పరిస్థితి దీనంగా మారుతోంది. ప్రతి నిత్యం నార్మూల్ డెయిరీకి పాలు పోసే రైతులకు గతంలో ప్రతి పదిహేను రోజులకోసారి బిల్లులను వారి బ్యాంకు ఖాతాల్లో వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాడి రైతుల దుస్థితి చెప్పనలవి కాకుం డా ఉంది. నాలుగు నెలలుగా బిల్లులు ఇవ్వకపోవడంతో బాకీ దాదాపు రూ.ఆరు కోట్ల వరకు పెండెంగ్లో ఉంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
