గత 20 రోజులుగా నుంచి ఇసుక సరఫరా లేకపోడంతో ఇండ్ల నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇటు ఇసుక రవాణా ఎప్పుడు ప్రారంభమవుతుందో.. ఎప్పుడు పనులు ప్రారంభించుకోవాలో అని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు.. అటు టెండర్ పొందిన కాంట్రాక్టర్ పంతం వీడక పోవడంతో అధికారులకు ఏమి చేయాలో తోచడం లేదు.

ఇసుక పంచాయితీ సీఎంవో కార్యాలయంతోపాటు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లినా ఫలితం లేకపోవడంతో ఇందిరమ్మ లబ్ధిదారులతోపాటు ఇతర నిర్మాణాలు చేపడుతున్న వారు తమ నిర్మాణాలు నిలుపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.. ఇక్కడ అధికార పార్టీ నేతలు, కాంట్రాక్టర్ మధ్య కమీషన్ల పంచాయితీ తెగక పోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
