
హైదరాబాద్ న్యూస్ – మే 6, 2026
(శ్రీరామ్ చక్రి న్యూస్)
హైదరాబాద్లో మే 10న నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ గారి బహిరంగ సభ సన్నాహక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా GHMC మీర్పేట్ డివిజన్లో బీజేపీ ఆధ్వర్యంలో వాల్ పెయింటింగ్ కార్యక్రమం నిర్వహించారు.
డివిజన్ బీజేపీ అధ్యక్షులు తులసి ముకేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో, తులసి వెంకటేశ్వర్లు సహకారంతో “దేశం కోసం మోదీ – మోదీ కోసం మనం” అనే నినాదంతో వాల్ పెయింటింగ్ చేపట్టారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా నాయకులు సుల ప్రభాకర్, కాశీరాం యాదవ్, తుమ్మల రమేష్, జగన్ ముదిరాజ్, మల్లికార్జున్, శ్రీనివాస్ నాయక్ పాల్గొన్నారు. అలాగే భాస్కర్ కాలనీకి చెందిన సభ్యులు రాజేష్, శేఖర్ తదితరులు హాజరయ్యారు.
మోదీ గారి సభను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు.
