కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించకుంటే రైతులతో కలిసి ధర్నా చేస్తామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని తెలిపారు.

నాగిరెడ్డిపేట, మే 30: కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించకుంటే రైతులతో కలిసి ధర్నా చేస్తామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని తెలిపారు. శనివారం ఆయన మండలంలోని మాల్తుమ్మెద, కన్నారెడ్డి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వేముల రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొన్నారు. ధాన్యం కుప్పలను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ధాన్యం కొనే దిక్కులేక రైతులు రూ. 2900 వదులుకొని కేవలం రూ.1700లకు దళారులకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
