శాంతి చర్చలతో త్వరలోనే పశ్చిమాసియాలో(West asia) యుద్ధానికి ముగింపు పలుకుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతున్నది.

హైదరాబాద్ : శాంతి చర్చలతో త్వరలోనే పశ్చిమాసియాలో(West asia) యుద్ధానికి ముగింపు పలుకుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతున్నది. ఓ వైపు శాంతి చర్చలు జరుగుతుండగానే ఇరాన్‌లోని దక్షిణ ప్రాంతాలపై అమెరికా తీవ్ర దాడులకు దిగింది. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. దక్షిణ ఇరాన్లో క్షిపణి ప్రయోగ కేంద్రాలు, మైన్స్ అమర్చుతున్న పడవలపై తాము ఆత్మరక్షణ దాడులు నిర్వహించినట్టు అమెరికా సైన్యం తెలిపింది.
