ఉదయం లేవగానే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నా ఉపాధి కూలీలకు మాత్రం పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించడం లేదు

భద్రాద్రి కొత్తగూడెం; ఎండల్లో ‘ఉపాధి కూలీలు’ విలవిలలాడుతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయాల్సిన ఉపాధిహామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తున్నది. కూలీలకు కొత్త కొత్త రూల్స్ పెడుతున్నది తప్ప.. వారికి పనిప్రదేశంలో కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. పట్టించుకోవాల్సిన సంబంధిత అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎండలో కష్టపడి పనిచేసినా రెక్కల కష్టానికి తగిన ప్రతిఫలం కూడా రావడంలేదని కూలీలు మరోపక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
