
న్యూస్ టుడే :(శ్రీరామ్ చక్రీ న్యూస్ ) మే 15
మహేశ్వరం నియోజకవర్గం శ్రీ రామకృష్ణాపురం డివిజన్లో మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా SBI ప్రైవేట్ హౌజెస్ కాలనీ, రోడ్ నెంబర్-4లో డ్రైనేజ్ లైన్ పూర్తిగా నిండి పొంగిపొర్లుతున్న సమస్య స్థానికుల దృష్టికి వచ్చింది. కాలనీ అధ్యక్షులు బిక్షం రెడ్డి గారు సమస్యను RK PURAM డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న గణేష్ నేత గారికి వివరించారు.సమస్య తీవ్రతను వెంటనే గుర్తించిన పున్న గణేష్ నేత గారు జలమండలి సివరేజ్ బోర్డు అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు చేపట్టేలా చేశారు. అనంతరం క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యటిస్తూ డ్రైనేజ్ సమస్యను పరిష్కరించే పనులను పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో సివరేజ్ బోర్డు ATO వర్క్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ సంతోష్ కుమార్, నవీన్, సివరేజ్ బోర్డు సిబ్బంది, కాలనీవాసులు మరియు ఇతరులు పాల్గొన్నారు.స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు స్పందించిన పున్న గణేష్ నేత గారికి కాలనీవాసులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
