15 ఏళ్లుగా నిలిచిపోయిన మోడల్ లైటింగ్ వ్యవస్థ పునరుద్ధరణ

న్యూస్ టుడే :(శ్రీరామ్ చక్రీ న్యూస్ ) మే:15:మహేశ్వరం నియోజకవర్గంలోని శ్రీ రామకృష్ణాపురం డివిజన్ పరిధిలోని వాసవి కాలనీ రోడ్ నెం.1/Aలో గత పదిహేనేళ్లుగా నిరుపయోగంగా ఉన్న మోడల్ లైటింగ్ సిస్టమ్‌ను స్థానిక ప్రజల విజ్ఞప్తితో పునరుద్ధరించారు.కాలనీవాసి సుధాకర్ శర్మ సమస్యను స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని, అనంతరం తన దృష్టికి తీసుకురాగానే సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు చేపట్టినట్లు శ్రీ రామకృష్ణాపురం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న గణేష్ నేత తెలిపారు.MMC అధికారుల సహకారంతో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ నిర్వహించి మోడల్ లైటింగ్ వ్యవస్థను పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు.డివిజన్లోని అన్ని కాలనీలను సమస్యలులేని ప్రాంతాలుగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, TPCC సభ్యుడు దేప భాస్కర్ రెడ్డి సహకారం అందిస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జెల్లా జగన్నాథం, కార్యదర్శి మల్లేష్ యాదవ్, ఉపాధ్యక్షుడు లింగారెడ్డి, కోశాధికారి శ్రీధర్ రెడ్డితో పాటు సుధాకర్ శర్మ, భాస్కర్, సుధాకర్ గుప్తా, నాగరాజు, పురుషోత్తం గుప్త, సూర్యనారాయణ గుప్త, జంగారెడ్డి మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.
