బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భువనగిరి పట్టణ పరిధిలో డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించిన పత్రాలు అందజేశారని, ప్రభుత్వ మారిన అనంతరం ఇండ్లు అప్పగించకుండా కాలయాపన చేస్తున్నారని లబ్ధిదారులు మండిపడుతున్నారు

భువనగిరి అర్బన్ జూన్ 3 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భువనగిరి పట్టణ పరిధిలో డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించిన పత్రాలు అందజేశారని, ప్రభుత్వ మారిన అనంతరం ఇండ్లు అప్పగించకుండా కాలయాపన చేస్తున్నారని లబ్ధిదారులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటి నా పట్టణ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను నేటికీ లబ్ధిదారులకు అందజేయలేదన్నారు. దీంతో బుధవారం లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇండ్లలోకి వెళ్లి గదులను శుభ్రం చేసుకున్నారు.
