ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా బుధవారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.

సిద్దిపేట: ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా బుధవారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేడుకల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు బ్రెడ్డు, పండ్లు పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆలయాల్లో పూజలు చేశారు.
