షాద్‌నగర్ నియోజకవర్గంలోని సిద్ధాపూర్ గ్రామంలో డంపింగ్‌యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌చేస్తూ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌తో కలిసి డంపింగ్‌యార్డు వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణులు, గ్రామస్తులు సోమవారం పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.

రంగారెడ్డి, జూన్ 1 : షాద్‌నగర్ నియోజకవర్గంలోని సిద్ధాపూర్ గ్రామంలో డంపింగ్‌యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌చేస్తూ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌తో కలిసి డంపింగ్‌యార్డు వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణులు, గ్రామస్తులు సోమవారం పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ముందుగా సిద్ధాపూర్ నుంచి మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు, బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో ర్యాలీగా కలెక్టరేట్‌కు తరలివచ్చారు. కాగా, డంపింగ్‌యార్డు హటావో….సిద్ధాపూర్ బచావో పేరుతో నిర్వహించిన ర్యాలీని సబితాఇంద్రారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
