కేసీఆర్ చేతుల మీదుగా బి-ఫారమ్, రూ.40 లక్షల చెక్కు అందజేత

హైదరాబాద్, అక్టోబర్ 14 (శ్రీరామ్ చక్రీ న్యూస్):
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ బరిలో నిలవనున్నారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు ఆదివారం ఆమెకు అధికారికంగా బి-ఫారమ్‌ను, అలాగే ఎన్నికల ఖర్చుల నిమిత్తం రూ. 40 లక్షల చెక్కును అందజేశారు.

ఈ కార్యక్రమం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులు కుమారుడు, కుమార్తెలు పాల్గొన్నారు. అలాగే పలువురు ప్రముఖ బీఆర్ఎస్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు తదితరులు పాల్గొని మాగంటి సునీతకు మద్దతు ప్రకటించారు.
పార్టీ అధినేత కేసీఆర్ గారి నుంచి నేరుగా ఆశీర్వాదం తీసుకున్న మాగంటి సునీత, గెలుపు సాధించి మాగంటి గోపీనాథ్ గారి సేవలను కొనసాగిస్తానని హామీ ఇచ్చారు.

సూపర్