సరూర్ నగర్ డివిజన్లో మౌలిక వసతుల కొరతపై కాంగ్రెస్ ప్రతినిధుల ఆందోళన

హైదరాబాద్, అక్టోబర్ 14 (శ్రీరామ్ చక్రీ న్యూస్):
ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలోని సరూర్ నగర్ డివిజన్లో మౌలిక వసతుల కొరతను వెంటనే పరిష్కరించాల్సిందిగా కోరుతూ సరూర్నగర్ డివిజన్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు సోమవారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గారికి మెమోరాండాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా వారు భగత్ సింగ్ నగర్, శంకర్ నగర్, ఇందిరా హిల్స్, చౌడి, బాపునగర్, చెరుకు తోట కాలనీ, అంబేద్కర్ నగర్ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, మహిళా భవనాలు, ఐమాక్స్ లైట్స్, కమ్యూనిటీ హాల్స్ లాంటి మౌలిక వసతులు తీవ్రంగా లోపించాయని పేర్కొన్నారు.
ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులు వెంటనే స్పందించి పనులు ప్రారంభించాల్సిందిగా కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాల ప్రయోజనాలు చేరడం లేదని వారు విన్నవించారు.

ఈ కార్యక్రమంలో సరూర్నగర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
