తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని కొహెడ గ్రామంలో సోమవారం ఉద్రిక్తత నెలకొన్నది. బాటసింగారం పండ్ల మార్కెట్‌కు శాశ్వత భవనాల ఏర్పాటు కోసం ప్రభు త్వం సర్వేనంబర్ 167/1లోని 179 ఎకరాలను కేటాయించింది.

తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని కొహెడ గ్రామంలో సోమవారం ఉద్రిక్తత నెలకొన్నది. బాటసింగారం పండ్ల మార్కెట్‌కు శాశ్వత భవనాల ఏర్పాటు కోసం ప్రభు త్వం సర్వేనంబర్ 167/1లోని 179 ఎకరాలను కేటాయించింది. అయితే ఆ భూమిని కొన్నేండ్లుగా ఆ ఊరికే చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు సాగు చేసుకుని జీవిస్తున్నారు. కాగా, సోమవారం ఉదయం పండ్ల మార్కెట్‌కు సంబంధించిన అధికారులు భారీ పోలీస్ బందోబస్తుతో కలిసి ఆ స్థలాన్ని చదును చేసేందుకు జేసీబీలతో కలిసి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు ఒక్కసారిగా అక్కడికి వందలాదిగా చేరుకుని అధికారులను అడ్డుకున్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వం కొహెడలోని సర్వేనంబర్ 548లో 133 ఎకరాలు, సర్వేనంబర్ 507లో 44 ఎకరాల ప్రభుత్వ భూమిని బాటసింగారం పండ్ల మార్కెట్‌కు కేటాయించింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మార్కెట్‌ను నిర్మించాలని భావించి డీపీఆర్‌ను కూడా సిద్ధం చేసింది. కాగా, ఆ సమయంలోనే అసెంబ్లీ ఎన్నికలొచ్చి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈ భూమిని రేవంత్ సర్కార్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పేరుతో ఇతరులకు కేటాయించేందుకు టీజీఐఐసీకి బదిలీ చేసింది. ఆ తర్వాత అనేక వివాదాల్లో చిక్కుకున్న సర్వేనంబర్ 167లో గల 179 ఎకరాలను పండ్ల మార్కెట్‌కు కేటాయించింది. మరోవైపు ఈ భూమిని సాగుచేసు కుని జీవిస్తున్న వందలాది మంది రైతులు ఈ కేటా యింపును మొదటినుంచి వ్యతిరేకిస్తున్నారు.
