ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో త్రిపురకు చెందిన ఎంబీఏ విద్యార్థి ఎంజెల్ చక్మ కిరాతక హత్యపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో త్రిపురకు చెందిన ఎంబీఏ విద్యార్థి ఎంజెల్ చక్మ కిరాతక హత్యపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన దేశంలో పెరుగుతున్న విద్వేషానికి, జాత్యహంకారానికి పరాకాష్ట అని ఆయన సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు. జాత్యహంకారం అనేది నాగరిక సమాజానికి పట్టిన అంటువ్యాధి అంటూ కేటీఆర్ స్పష్టం చేశారు.
