వెంటనే మమ్మల్ని కష్టాలనుంచి గట్టెక్కించు స్వామి అని మన ఇష్టదైవాన్ని వేడుకుంటాం. అనుకున్నట్టు జరిగితే నేరు నీ సన్నిదికి వచ్చి దర్శించుకుంటామని మనసులో అనుకుంటాం. కొరికలు నెరవేరిన వెంటనే ఆయానికి వెళ్లి మొక్కు తీర్చుకుంటాం. కానీ ఇక్కడో గణేషుడి ఆలయం మాత్రం చాలా ప్రత్యేకం. కొరికలు తీర్చమని భక్తులు ఆలయానికి రావాల్సిన అవసరం లేదు.. కేవలం మన సమస్యలను ఒక ఉత్తరంపై రాసి పంపితే చాలా.. ఆయనే మన క్షాలను తీర్చుతాడని కొందరు భక్తులు చెబుతున్నారు. ఇంతకు ఈ ఆలయం ఎక్కడుందో అనే కదా.. మీ డౌట్.. అయితే తెలుసుకుందాం పదండి.
మనం ఆలయం దాకా వెళ్లకుండానే మన కష్టాలను ఒక ఉత్తరంపై రాసి పంపితే కోరికలు తీర్చే త్రినేత్ర గణేశుడి ఆలయం రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లా రణథంబోర్‌లో ఉంది. ఇక్కడ వినాయకుడు మూడు నేత్రాలతో వెలిశాడు. మనకు ఎన్ని కష్టాలు ఉన్నా వాటిని ఒక చిన్న ఉత్తరంపై రాసి పంపితే.. వాటిని ఆ గణపయ్యే స్వయంగా చదివి మన సమస్యలను నెరవేర్చుతాడని ఇక్కడి వచ్చే భక్తుల అపార నమ్మకం. అందుకే ఇది నమ్మే చాలా మంది భక్తులు తమకు ఏ కష్టం వచ్చినా వాటిని ఒక ఉత్తరంపై రాసి వెంటనే స్వామి వారి ఆలయం అడ్రస్‌కు పోస్ట్ చేస్తారు. అలా వచ్చిన ఉత్తరాలను స్థానిక పోస్ట్ మ్యాన్ ఆలయ పూజరికి అందజేస్తారు. పూజారి వాటిని స్వామి వారి గర్బగుడిలో ఉంచుతాడు.

