నల్లగొండ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.

నల్లగొండ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మిర్యాలగూడలోని ఓ ఇంట్లో అర్ధరాత్రి సమయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. మరణించిన వారిని అమ్మమ్మ వనం చంద్రకళ, మనుమడు లక్ష్మణ్ (16), మనమరాలు ప్రణతి (14) మృతిచెందినట్లు గురువారం రాత్రి మనుమడు, మనుమరాలితో చంద్రకళ తమ రేకుల ఇంట్లో నిద్రిస్తుండగా షార్ట్‌సర్క్యూట్ అయ్యింది. విద్యుదాఘాతం కారణంగా ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇది గమనించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా.. భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు.
