బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో వీర్నపల్లి మండలంలో ఏర్పాటు చేస్తున్న కేసీఆర్ కంటి శిబిరాలు గిరిజన పల్లెలు, లంబాడి తండాల్లో వెలుగులు నింపుతున్నాయి.

వీర్నపల్లి జూన్ 29 : బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో వీర్నపల్లి మండలంలో ఏర్పాటు చేస్తున్న కేసీఆర్ కంటి శిబిరాలు గిరిజన పల్లెలు, లంబాడి తండాల్లో వెలుగులు నింపుతున్నాయి. వారం పాటు నిర్వహిస్తుండగా, మొదటి రోజైన ఈ నెల 27న వీర్నపల్లి మండలకేంద్రంలో నిర్వహించారు. వీర్నపల్లి క్లస్టర్ పరిధిలో 8 గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలి రాగా, సభేరి ఐ హాస్పిటల్కు చెందిన సుమారు 20 మంది నిపుణులు పరీక్షలు చేశారు. 320 మంది పరీక్షలు చేయించుకున్నారు.
