జిల్లాలో మరో నెలరోజుల పాటు వరి ధాన్యం కొనుగోళ్లు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ నిర్వాకం వల్లే కొనుగోళ్ల ప్రక్రియ జిల్లాలో ఆలస్యమవుతున్నది.

వనపర్తి, మే 31: జిల్లాలో మరో నెలరోజుల పాటు వరి ధాన్యం కొనుగోళ్లు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ నిర్వాకం వల్లే కొనుగోళ్ల ప్రక్రియ జిల్లాలో ఆలస్యమవుతున్నది. ముందు నుంచి ఈ యాసంగికి గోదాంల కొరత ఉన్నదని జిల్లా యంత్రాంగానికి తెలిసిందే. 3లక్షల 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం పెట్టుకున్న సంగతి విధితమే. అయితే, ఈ మేరకు ఏర్పాట్లు చేయడంలోనే ప్రభుత్వం విఫలమైంది. దీంతోనే సమ స్య ముదిరి నెల రోజులుగా కల్లాల్లో రైతులకు కునుకులేకుండా పోయిం ది. ఇదిలా ఉంటే, వారం రోజుల్లో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ము గించాలని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఇటీవల మహ బూబ్నగర్లో చెప్పడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
