ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గంటపాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురవగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

కామారెడ్డి/చందూర్/నిజాంసాగర్/భిక్కనూరు, జూన్ 4 : ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గంటపాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురవగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పలు కాలనీల్లో రోడ్లు జలమయమవగా రైల్వేస్టేషన్ వెనుక భాగంలో ఓ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కిందపడిపోయింది. నిజాంసాగర్ మండల కేంద్రంలో నర్సింగ్రావ్పల్లి చౌరస్తా ప్రధాన రహదారిపై భారీ వృక్షం అడ్డంగా పడిపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
