ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఓరుగల్లును అవమానిస్తూ… ఓరుగల్లుకు ప్రతీకగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని తెలంగాణ రాజముద్ర నుంచి తీసేందుకు ప్రయత్నిస్తున్నాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఘోరీ కట్టేదిశగా పోరాటం నడుస్తున్నదని చెప్పారు.

తెలంగాణ సాధించిన కేసీఆర్ దీక్షా దివస్ స్ఫూర్తితో ఓరుగల్లు నుంచే ప్రతిఘటన మొదలవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఓరుగల్లును అవమానిస్తూ… ఓరుగల్లుకు ప్రతీకగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని తెలంగాణ రాజముద్ర నుంచి తీసేందుకు ప్రయత్నిస్తున్నాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఘోరీ కట్టేదిశగా పోరాటం నడుస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క బీసీ వర్గాలకే కాదు.. తెలంగాణలోని సబ్బండవర్గాలకు అన్యాయం చేస్తున్నదని అన్నారు.
