ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీజీఈ జేఏసీ(తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.

ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండటంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా జూన్ 2వ తేదీ నాటికి కొత్త పీఆర్సీని 51 శాతం ఫిట్మెంట్తో తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని, నగదు రహిత ఆరోగ్య పథకాన్ని ప్రారంభించాలని, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు.
