సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలోని ఒక్కో ప్రదేశానికి ఒక్కో చరిత్ర, ప్రత్యేకత ఉంది.అందులో స్వామి వారి అభిముఖానికి ఎదురుగా మండపం ముందు భాగంలో ఉన్న గంగరేగు చెట్టు భక్తుల పాలిట కల్పవృక్షంగా భావిస్తారు.

చేర్యాల: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలోని ఒక్కో ప్రదేశానికి ఒక్కో చరిత్ర, ప్రత్యేకత ఉంది.అందులో స్వామి వారి అభిముఖానికి ఎదురుగా మండపం ముందు భాగంలో ఉన్న గంగరేగు చెట్టు భక్తుల పాలిట కల్పవృక్షంగా భావిస్తారు. స్వామివారి మహిమ మూలంగానే గంగరేగు చెట్టు ఏడాది పొడవునా పచ్చదనంతోనే ఉంటుందని భక్తులు నమ్ముతారు. వాతావరణంలో మార్పులు వచ్చినప్పటికీ గంగరేగు చెట్టు మాత్రం అన్నికాలాల్లో పచ్చదనంతో ఉట్టి పడుతుంటుంది.స్వామి వారి క్షేత్రానికి వచ్చిన భక్తులు గంగరేగు చెట్టు వద్ద ప్రదక్షిణలు చేసి, తమ కోరికలు తీర్చాలని మొక్కుకుంటారు. మరికొందరు భక్తులు గంగరేగు చెట్టు వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇనుప జాలీలకు ముడుపు కట్టి కోరిక తీరాలని దేవుడికి మొక్కుకుంటారు.
