తమ సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలని మున్సిపల్ కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ మున్సిపల్ వరర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం ఉదయం మున్సిపల్ కార్మికులు హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియం నుంచి ర్యాలీగా బయలుదేరి సుబేదారిలోని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఇండ్ల ఎదుట ధర్నా నిర్వహించారు.

హనుమకొండ/సుబేదారి, జూన్ 29 : తమ సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలని మున్సిపల్ కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ మున్సిపల్ వరర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం ఉదయం మున్సిపల్ కార్మికులు హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియం నుంచి ర్యాలీగా బయలుదేరి సుబేదారిలోని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఇండ్ల ఎదుట ధర్నా నిర్వహించారు.
