అకాల వర్షాలు రైతులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈదురు గాలులకుతోడు వర్షం కురవడంతో ఆరబోసిన మక్కలు, ధాన్యం తడిచిపోయింది

అకాల వర్షాలు రైతులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈదురు గాలులకుతోడు వర్షం కురవడంతో ఆరబోసిన మక్కలు, ధాన్యం తడిచిపోయింది. నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, వనపర్తి, ఖిల్లాఘణపురం, కొత్తకోట, రాజోళి, మహబూబ్‌నగర్‌లో వాన పడింది. నవాబ్‌పేట, ఆత్మకూరులో వడగండ్ల వర్షం కురిసింది. దీంతో మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడ్డారు.
