ప్రకృతి ప్రసాదించే పండ్ల జాతుల్లో ఒకటైన ఆరోగ్య ఫలప్రదాయినిగా పిలిచే అల్లనేరేడు పండ్లను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి సంపూర్ణంగా మేలు కలుగుతుంది.

హనుమకొండ: ప్రకృతి ప్రసాదించే పండ్ల జాతుల్లో ఒకటైన ఆరోగ్య ఫలప్రదాయినిగా పిలిచే అల్లనేరేడు పండ్లను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి సంపూర్ణంగా మేలు కలుగుతుంది. సహజసిద్ధంగా లభించే అల్లనేరేడు పండ్లు తీపి, వగరు, పులుపు రుచులతో నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఎన్నో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న ఫలం. వర్షాకాలం ప్రారంభంలో విరివిగా దొరికే అల్లనేరేడు పండ్లు ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తాయి. నేరేడు పండ్లను తినడం ద్వారా మానవ శరీరంలోని పలు రుగ్మతలైన మధుమేహాన్ని నియంత్రించడంతో పాటు జీర్ణక్రియ మెరుగుపడడం, మలబద్ధకం, గ్యాస్స్ట్రబుల్, అజీర్తి వంటి సమస్యలనుంచి విముక్తి పొందవచ్చని పలువురు వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
