ధర్మన్నగూడ నుంచి తులేకలాన్ (పెత్తుల్ల)వెళ్లే రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. గత కొంతకాలంగా రోడ్డంతా మట్టి కొట్టుకుపోయి కంకర తేలి గుంతలమయంగా మారింది.

యాచారం, నవంబర్12: రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని ధర్మన్నగూడ నుంచి తులేకలాన్ (పెత్తుల్ల)వెళ్లే రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. గత కొంతకాలంగా రోడ్డంతా మట్టి కొట్టుకుపోయి కంకర తేలి గుంతలమయంగా మారింది. ఇటివల కురిసిన భారీ వర్షాలకు రోడ్డు కోతకు గురికావడంతో వాహనాలు వెళ్లలేని దుస్థితి నెలకొన్నది. కార్లు, ఆటోలు కాదుకదా కనీసం ద్విచక్రవాహనాలు సైతం వెళ్లలేనంత అధ్వాన్నంగా తయారైంది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు నిత్యం ఈ లింకు రోడ్డుతో నరకం చవిచూస్తున్నారు. రోడ్డుపై వాహనాలు నడపాలంటేనే జంకుతున్నారు.
