కామారెడ్డి జిల్లాలోని పత్తి రైతులకు ఈసారి కూడా గడ్డు కాలమే దాపురించబోతోంది. ఇప్పటికే సాగులో నానా తంటాలు పడిన పత్తి రైతుకు సీసీఐ కొనుగోలు కేంద్రాలు లేక ఆందోళన

కామారెడ్డి జిల్లాలోని పత్తి రైతులకు ఈసారి కూడా గడ్డు కాలమే దాపురించబోతోంది. ఇప్పటికే సాగులో నానా తంటాలు పడిన పత్తి రైతుకు సీసీఐ కొనుగోలు కేంద్రాలు లేక ఆందోళన చెందుతున్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏటా ఆలస్యంగా సెంటర్లు ప్రారంభిస్తుండటంతో రైతులకు నష్టాలు సంభవిస్తున్నాయి. ప్రధానంగా జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతులకు కేంద్ర సర్కారు తీరుతో నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తోంది. ఓ వైపు 8-12శాతం తేమ నిబంధనలకు తోడుగా స్లాట్ బుకింగ్ ఉంటేనే కొనుగోళ్లు చేస్తామంటూ ఖరాకండిగా చెబుతుండటం రైతులను ముచ్చెమటలు పట్టిస్తోంది
