త్తి పంట చేతికొచ్చే సమయంలో సుమారు 150 మంది ఫారెస్ట్ అధికారులు మంగళవారం సాయంత్రం చీకటి పడే సమయంలో కత్తులు, గొడ్డళ్లతో పత్తి పంటను ధ్వంసం చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం రావికంపాడు పంచాయతీ పరిధిలో గల పోడు రైతుల భూముల్లో అటవీ శాఖ అధికారులు పత్తి పంటను ధ్వంసం చేశారు. పత్తి పంట చేతికొచ్చే సమయంలో సుమారు 150 మంది ఫారెస్ట్ అధికారులు మంగళవారం సాయంత్రం చీకటి పడే సమయంలో కత్తులు, గొడ్డళ్లతో పత్తి పంటను ధ్వంసం చేశారు. పత్తి పంటను ధ్వంసం చేసిన విషయం బుధవారం పత్తి చేనులకు వెళ్లిన పోడు రైతులు గుగులోతు లాలి, తేజావత్ సరోజా చూసి బోరున విలిపించారు.
