తెలంగాణలో ఒకవైపు ఎండలు మండుతుండగా.. మరోవైపు అకాల వర్షాలు దంచికొడుతున్నాయి.

హైదరాబాద్; హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్, మియాపూర్, చందానగర్,లింగంపల్లి, గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్, బంజారాహిల్స్, కూకట్పల్లి, నిజాంపేట, బాచుపల్లి, ఖైరతాబాద్, ఎల్బీనగర్, ఉప్పల్, వనస్థలిపురం, హయత్ నగర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది.
