బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే తెలంగాణ రాష్ర్టానికి రక్షణ కవచంగా ఉన్నదని ప్రజలు భావిస్తున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి అన్నారు

పరిగి, జూన్ 9 : బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే తెలంగాణ రాష్ర్టానికి రక్షణ కవచంగా ఉన్నదని ప్రజలు భావిస్తున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి అన్నారు. అనుక్షణం రాజకీయంతోనే బతకాలని కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదని విమర్శించారు. గతంలో కేసీఆర్, రాజశేఖర్‌రెడ్డిల హ యాంలో అసెంబ్లీ ఎన్నికలైన ఏడాదిలోపే అన్ని ఎన్నికలు నిర్వహించి మిగతా నాలుగేండ్లు అభివృద్ధిపై దృష్టి పెట్టారన్నారు. హామీల అమలు చేతకాకే కేసీఆర్‌పై విమర్శలు చేస్తూ రేవంత్‌రెడ్డి కాలం వెళ్లదీస్తున్నారని ఎద్దేవా చేశారు.
