సింగరేణి సంస్థ, సింగరేణి ప్రాంతంలోని శాసన సభా స్థానాలపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సింగరేణి ప్రాంత మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ప్రతినిధులతో కీలక భేటీకానున్నారు

రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం, సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, సర్కారు సంఘం ఐఎన్టీయూసీలు ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై చర్చించనున్నారు. రానున్న ఐదేళ్లలో సింగరేణిలో10 గనులు మూతపడనున్నగా, కార్మికులకు ఉద్యోగ భద్రత కరువయ్యే పరిస్థితి ఉన్నది. అలాగే కార్మికులు అదనంగా ఉన్నారంటూ గోల్డెన్ హ్యాండ్ షేక్(స్వచ్ఛంద ఉద్యోగ విరమణ) ద్వారా యాజమాన్యం కుట్రలు చేస్తున్నందున, కార్మికులను పోరాటాలపై వైపు చైతన్య పరిచేందుకు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
