మాజీ సీఎం కేసీఆర్ తాను గుర్తించిన ప్రతీ సమస్యకు పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పరిష్కారం చూపారు. గ్రామాలు, పట్టణాల్లో శ్మశానవాటికలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేశారు. మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సూర్యాపేటలో రూ.3.59 కోట్లతో సద్దుల చెరువు కట్ట పక్కన హిందూ శ్మశాన వాటికను మహాప్రస్థానం పేరుతో నిర్మించారు.

రూ.4.50 కోట్లతో జమునానగర్ పక్కన హిం దూ శ్మశానవాటిక, రూ.1.50 కోట్లతో ముస్లింలకు ఖబ్రస్థాన్, రూ. 50 లక్షలతో క్రిస్టియన్ సమాధుల తోట, పట్టణంలో రూ.5.28 కోట్లతో పట్టణంలోని కుడకుడ, దురాజ్‌పల్లి, ఖాసీంపేట, నల్లచెరువుతండా, సైనిక్‌పురి కాలనీ, బుర్కపిట్టతండా, పుల్లారెడ్డి చెరువు పక్కన, మామిళ్లగడ్డ, పిల్లలమర్రి, గాంధీనగర్, బీబీగూడెం, చంద్రన్నకుంట, భగత్‌సింగ్‌నగర్, నెహ్రు నగర్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ శ్మశాన వాటికలను అభివృద్ధి చేశారు.
