దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి నేపథ్యంలో ఇప్పటికే దర్శనాలు నిలిపివేసిన అధికారులు.. తాజాగా ఆలయంలోకి ప్రవేశించకుండా ప్రధాన ద్వారం వద్ద ఇనుప రేకులు అమర్చారు

వేములవాడ టౌన్ : దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న అలయంలో దర్శనాల విషయంలో అధికారులు అనుసరిస్తున్న వైఖరి భక్తులకు ఇబ్బందికరంగా మారుతున్నది. ఆలయ అభివృద్ధి నేపథ్యంలో ఇప్పటికే రాజన్న గుడిలో దర్శనాలు నిలిపివేసిన అధికారులు.. తాజాగా ఆలయంలోకి ప్రవేశించకుండా ప్రధాన ద్వారం వద్ద ఇనుప రేకులు అమర్చారు. కేవలం స్వామి వారి చతుష్కాల పూజలకు అర్చకులను మాత్రమే అనుమతిస్తున్నారు.
