
(శ్రీరామ్ చక్రి న్యూస్)మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్, మీర్పేట్ హెచ్బీ కాలనీ 4వ డివిజన్ వార్డు ఆఫీసులో కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వార్డు ఆఫీసులో మాత్రమే కాకుండా, ఆయుష్మాన్ భారత్ పల్లె దవాఖాన, GHMC శాఖల అధికారులు, పేషంట్ల వాహనాలు ఒకే ప్రాంగణంలో ఉండడంతో రద్దీ, ఇబ్బందులు తీవ్రమయ్యాయని వర్గాలు తెలిపారు.
స్థానికులు, ట్రాఫిక్ స్టేషన్ కోసం ప్రత్యామ్నాయ ప్రదేశాన్ని కనుగొని, వార్డు ఆఫీసులో ప్రజా సేవలకు వీలుగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. “పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, పేషంట్లు సురక్షితంగా సేవలు పొందాలి,” అని వారు తెలిపారు.
