రోడ్డు భద్రత నియమాలు పాటించడం మనందరి భాద్యత అని కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు.

జగిత్యాల : రోడ్డు భద్రత నియమాలు పాటించడం మనందరి భాద్యత అని కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు. గురువారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం – 2026 బైక్ ర్యాలీని జిల్లా కేంద్రంలో కలెక్టర్ సత్యప్రసాద్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యమని తెలిపారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉందన్నారు. మద్యం సేవించి వాహనం నడపరాదని హెచ్చరించారు.
