సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని రెవెన్యూశాఖలో అవినీతి ఆరోపణలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లా చేర్యాల తహసీల్దార్ దిలీప్నాయక్ రూ.70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు సోమవారం పట్టుబడటం ఉమ్మడి జిల్లాల్లో చర్చకు దారితీసింది

సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని రెవెన్యూశాఖలో అవినీతి ఆరోపణలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లా చేర్యాల తహసీల్దార్ దిలీప్నాయక్ రూ.70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు సోమవారం పట్టుబడటం ఉమ్మడి జిల్లాల్లో చర్చకు దారితీసింది. ఈ ఘటనతో తహసీల్దార్ కార్యాలయాల పనితీరుపై ప్రజల్లో మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూ సమస్యలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, వారసత్వ మార్పులు, ఎన్వోసీలు, భూ రికార్డుల సవరణలు, ఇతర రెవెన్యూ సేవల కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజల నుంచి పనిని బట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బు ఇస్తేనే పని.. లేకపోతే ఫైల్ పెండింగ్ అనే పరిస్థితి నెలకొన్నది.
