ఆదిలాబాద్ జిల్లాలో రైతులకు యూరియాను ‘యూరియా బుకింగ్ యాప్’ ద్వారా బుకింగ్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఎదులాపురం, జూన్ 12 : ఆదిలాబాద్ జిల్లాలో రైతులకు యూరియాను ‘యూరియా బుకింగ్ యాప్’ ద్వారా బుకింగ్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కౌలు రైతులు, పట్టా పాసుపుస్తకం లేని రైతులు కూడా మొబైల్ నంబర్ ఆధారంగా యాప్లో నమోదు చేసుకుని యూరియా పొందే అవకాశం కల్పించినట్లు తెలిపారు. గతేడాది పంట నమోదు ప్రక్రియలో నమోదు కాని ఎన్డీఎస్, పీపీ భూముల రైతులు తమ మండల వ్యవసాయ అధికారులను సంప్రదించి యాప్లో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు
