ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి మర్కో రూబియో శనివారం సమావేశమయ్యారు

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి మర్కో రూబియో శనివారం సమావేశమయ్యారు. భారత్-అమెరికాల మధ్య వివిధ రంగాల్లో కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారం, పురోగతిపై ఇద్దరు నేతలు చర్చించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం(పీఎంవో) ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరపున త్వరలో వైట్‌హౌస్‌ను సందర్శించాల్సిందిగా ప్రధాని మోదీని రూబియో ఆహ్వానించారు. సమావేశం అనంతరం ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా ఈ భేటీకి సంబంధించిన వివరాలు తెలిపారు.
