రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు.

గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రెండు నెలలు కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు యాభై శాతం కూడా కొనలేదని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట కేంద్రాల్లో ఉన్నదనే బాధతో రైతు ఉన్నాడని, దీనికి తోడు రోహిణీకార్తె వచ్చి నారులు పోసుకునే సమయం ఆసన్నమవడంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే సెంటర్లలోని ధాన్యాన్ని రెండు, మూడు రోజుల్లో కొనాలని ఆయన డిమాండ్ చేశారు.
