మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్షంగా కృషి చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి అదిలాబాద్ నేతలకు సూచించారు.

హైదరాబాద్లో కేటీఆర్, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గెలుపే లక్ష్యంగా నాయకులు కృషి చేయాలని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉండి కూడా పెద్దగా చేసింది ఏమిలేదన్న విషయాన్ని నగర ప్రజలకు అవగాహన కల్పించాలని కేటీఆర్ చెప్పారు.
