
డిసెంబర్ 20 (శ్రీరామ్ చక్రి న్యూస్):
మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెల గూడలో ఉన్న శ్రీ మత్స్యవతార, వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ముక్కోటి ఏకాదశి మహోత్సవానికి హాజరుకావాలని కోరుతూ ఆలయ నిర్వాహకులు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా దేవస్థానం ఈవో శ్రీనివాస్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్ గౌడ్, మాజీ ధర్మకర్తలు మాదరి రమేష్, పోరెడ్డి జంగా రెడ్డి, జ్ఞానేశ్వర్ చారి తదితరులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయంలో భక్తుల సౌకర్యార్థం చేపట్టనున్న ఏర్పాట్లను ఆలయ నిర్వాహకులు వివరించగా, సబితా ఇంద్రారెడ్డి ముక్కోటి ఏకాదశి వేడుకలు భక్తిశ్రద్ధలతో, విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు.
