
అసంపూర్తిగా నిలిచిన ఎస్ఎన్డీపీ నాలా పనులకు శ్రీకారం
మిథుల నగర్లో పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి,(శ్రీరామ్ చక్రీ న్యూస్ | 11-05-2026)
మహేశ్వరం నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ జిల్లాలగూడ డివిజన్ పరిధిలోని మిథుల నగర్లో అసంపూర్తిగా నిలిచిపోయిన ఎస్ఎన్డీపీ నాలా పనులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే Sabitha Indra Reddy ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె సంబంధిత అధికారులతో మాట్లాడి, రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నాలా పనులను నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎక్కడా అలసత్వం ప్రదర్శించకుండా పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అక్కల భూపాల్ రెడ్డి, డిప్లాల్ చౌహాన్, అరకల కామేష్ రెడ్డి, మదారి రమేష్, అనిల్ కుమార్ యాదవ్, విజయ్, దిండు భూపేష్ గౌడ్, లక్ష్మణ్ ముదిరాజ్, గోపి యాదవ్, సునీత బాలరాజ్, సుర్వి లత, పంతంగి మాధవి, బిందు, నిర్మల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
