
హైదరాబాద్, (శ్రీరామ్ చక్రి న్యూస్) మే 8: బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో హైదరాబాద్ ఇంచార్జి మంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని వారి జన్మదిన సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజాసేవలను కొనియాడిన పారిజాత నర్సింహారెడ్డి , ఆయన మరెన్నో ఉన్నత స్థానాలు అధిరోహించి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.
