ఉత్తరప్రదేశ్లోని మథుర వద్ద ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే పై ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

తెల్లవారుజామున పొగమంచు కారణంగా బస్సులు, కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఆ తర్వాత భారీగా మంటలు చెలరేగి.. వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 13కి పెరిగినట్లు అధికారులు తాజాగా తెలిపారు. సుమారు 80 మంది గాయపడినట్లు వెల్లడించారు.
మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై పది బస్సులు, పలు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో బస్సులకు మంటలు అంటుకున్నాయి. పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగసిపడటంతో ఏడు బస్సులు, కార్లు కాలిబూడిదయ్యాయి.
